2011/2/20 Gopal/గోపాల్ <[email protected]> > నమస్తే, > > ప్రస్తుతం జరుగుతున్న అనువాదాల్లో windows అనే పదానికి రెండు అనువాదాలున్నాయి. > ఒకటి యధాతథందా విండో అని వాడటం, ఇంకోటి గవాక్షము అని. విండో అని వాడటంలో కొన్ని > సమస్యలున్నాయి. ఒక తెలుగు పదాన్ని ఇంకో తెలుగు పదం తేలిగ్గా అక్కున > చేర్చుకుంటుంది. manager కి అభికర్త, నిర్వాహకి అని వాడుతున్నారు. > > ఇప్పుడు window manager అని ఉన్న చోట, విండో అభికర్త లేదా విండో నిర్వాహకి > అంటే అది సంకర భాషలా తోస్తుంది. దాని కన్నా గవాక్షాభికర్త అంటే పొందికగా, > చక్కగా ఉంది. కాబట్టి విండో ని ఇకపై గవాక్షం అనే అందామా? (FUEL వాళ్ళు గవాక్షం > నుంచి విండో కి వచ్చారు కొత్త రివిజన్ లో). > > సాధారణమైన కంప్యూటర్ పదజాలాన్ని తెలుగులో లిప్యంతరీకరణంతో రాయటమే మంచిదన్న విధానం వాడాము. కొంత సంకర పదాలున్నా సాంకేతిక పదజాలానికి అదే మంచి పద్దతి అనిపిస్తుంది నాకైతే.
ధన్యవాదాలు. అర్జున
_______________________________________________ Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te Post to : [email protected] Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te More help : https://help.launchpad.net/ListHelp

