అందరికీ నమస్కారం, ఈ కింది సమాచారం ఇండిక్ ఓరల్ కల్చర్ ప్రాజెక్టు <https://meta.wikimedia.org/wiki/Grants:Project/MSIG/Indic_Oral_Culture_Project> నిర్వాహకులు పంపగా నేను అనువదించి అందిస్తున్నాను.
ఇండిక్ ఓరల్ కల్చర్ ప్రాజెక్టు పేరిట భారతీయ భాషల్లో జానపద గేయాలు, జానపద కథలు మొదలు క్రమేపీ అంతరించిపోతున్న, సరైన ప్రాతినిథ్యం లేని మౌఖిక సంస్కృతిని (ఓరల్ కల్చర్) వికీమీడియా ప్రాజెక్టుల్లో భద్రపరిచి సంరక్షించడానికి కొద్దిమంది వికీపీడియన్లు కలసి నిర్వహిస్తున్నారు. వికీమీడియా ప్రాజెక్టుల ద్వారా మౌఖిక సంస్కృతిని ఎందుకు భద్రపరచదలిచారంటే: - జానపద గేయాలన్నవి అత్యంత వేగంగా మాయమవుతున్న సాంస్కృతిక సంపద అని జానపదాల గురించి తెలిసిన జనమూ, భాషావేత్తలూ కూడా భావిస్తున్నారు. - చాలామంది జనానికి వీడియోలు, ఆడియోలు రూపొందించడానికి ఈరోజు కెమెరాలు, మొబైల్ ఫోన్లు ఉన్నాయి. వాటిని ఉచితంగా ప్రాసెస్ చేయడానికి సాఫ్ట్‌వేర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. - వికీమీడియా ప్రాజెక్టుల్లో చేర్చడం ద్వారా సుదీర్ఘకాలం భద్రపరచడానికి, విజ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తంగా పంచుకునేందుకు అవకాశాలున్నాయి. ఎవరు దీనిలో పాల్గొనవచ్చు: - ఈ అంశంలో పనిచేసిన అనుభవం లేకపోయినా ఆసక్తి , భాషను, సంస్కృతిని కాపాడుకోవాలన్న ఉత్సాహం ఉంటే గనుక పూర్తి కొత్తవారైనా, ఇప్పటికే వికీమీడియన్లు అయినా కూడా పాల్గొనవచ్చు. నిర్వాహకులు ఏం అందిస్తున్నారంటే: - మౌఖిక సంస్కృతిని మొబైల్ ఉపకరణాలు వాడి వీడియోలుగా భద్రపరచడానికి, వికీమీడియా ప్రాజెక్టుల్లో చేర్చడానికి అవసరమైన వర్క్‌ఫ్లో నేర్పించేందుకు ఆన్‌లైన్ శిక్షణా కార్యక్రమం. - మౌఖిక సంస్కృతిని భద్రపరచడానికి, డిజిటైజ్ చేయడానికి వికీమీడియా ప్రాజెక్టులు ఉపయోగించుకునే వీలు. - అవసరమైనవారికి ఇంటర్నెట్ & ట్రావెల్‌కి అవసరమైన మద్దతు, per diem అందిస్తారు. ఈ అంశంపై మీకు ఆసక్తి ఉంటే మీరే [email protected] లేదా [email protected] అన్న మెయిల్ ఐడీలను సంప్రదించవచ్చు. లేదంటే మీకు ఈ అంశంపై ఆసక్తి ఉండి ఉండొచ్చనుకున్న వ్యక్తులతో కానీ, గ్రూపులతో కానీ పంచుకోండి. ధన్యవాదాలతో, పవన్ సంతోష్. _______________________________________________ WikiTe-L mailing list -- [email protected] To unsubscribe send an email to [email protected]
