గోపాల్ గారు, ప్రస్థుతం వాడుకలోనున్న స్థానికీకరణ ఒకింత వాడుక భాషకు దూరంగానే ఉంది.మొ దట స్థానికీకరణ చేసిన అనువాదాలు అలానే ఉండిపోయాయి కాని వాటిని నవీకరణ చేయడం గానీ పున:పరిశీలన ఆ తర్వాత జరగకపోవడం వల్ల ఇప్పటికీ కొన్ని అలానే ఉండిపోయాయి.దీనిలో కొన్ని మార్ఫులు చేసి పున:పరిశీలన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.మీ వంటివారు కూడా తలో చేయి వేస్తే ఈ ప్రక్రియ సులభమవుతుందని అభిప్రాయపడుతున్నాను.అంతేకాకుండా తెలుగు లినక్స్ వాడుకరులు కూడా వారి వారి సలహాలను, అభిప్రాయాలను పంచుకోవడం వలన దీని అభివృద్ది సాధ్యమవుతుంది.
19 ఫిబ్రవరి 2011 4:51 సా న, Gopal/గోపాల్ <[email protected]> ఇలా రాసారు : > నమస్తే, > > అనువదించినపుడు మరీ ఫార్మల్ గా ఉన్న వాక్యాలు కొంచె నవీన పద్దతిలో రాస్తే > వాడేవారికి "దగ్గరగా" ఉన్నట్టు ఉంటుంది. ఉదాహరణకి, "మూయుము" అనేకంటే "మూసివేయి" > అంటే బావుంటుంది. అలాగే, అప్పుడప్పుడు ఇంగ్లీషులో ఉన్న వాక్యంలో ఉన్న పదాల వరుస > చాలా మార్చాల్సి ఉంటుంది. అలాంటప్పుడు అనువాదం "దూరం" వెళ్ళిపోతూందేమో అని > చూడకుండా, వాడుకరులకు అర్థమవ్వడమే పరమావధిగా తథనుగుణంగా మార్చితేనే ఉపయోగకరం. > > Regards, > -- > Koduri Gopala Krishna, > Cognitive Science Lab, IIIT - Hyderabad, India. > Music Technology Group, UPF - Barcelona, Spain. > > Portfolio - http://tidbits.co.in > తెలుగువారికి సాంకేతిక సహాయం - http://techsetu.com > > > _______________________________________________ > Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te > Post to : [email protected] > Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te > More help : https://help.launchpad.net/ListHelp > -- > *ధన్యవాదాలు,* ప్రవీణ్.
_______________________________________________ Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te Post to : [email protected] Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te More help : https://help.launchpad.net/ListHelp

