కొత్త లిబ్రెఆఫీస్-తెలుగు <http://groups.google.com/group/libreoffice-te>జట్టుకి స్వాగతం. ఈ అనువర్తనము విండోస్, లినక్స్ మరియు యితర వ్యవస్థలలో పనిచేస్తుంది. దీనిగురించి చర్చించటానికి సరియైన గుంపు లేనందున ఈ కొత్త జట్టుని సృష్టించడమైనది. కంప్యూటర్లోలో తెలుగు వాడకం పెరిగేకొద్ది,దీని వినియోగం పెరుగుతుంది. దీనితో పాటు అక్షరక్రమ తనిఖీ యాడ్-ఆన్ కూడా వుండడంతో ఎక్కువగా తెలుగు కంప్యూటర్లో వాడేవారికి, పత్రాలు (రైటర్), లెక్కలు(కేల్క్), బొమ్మలు (డ్రా), ప్రజంటేషన్లు (ఇంప్రెస్) చాలా వుపయోగంగా వుంటుంది. ఇటీవలే విడుదలైన RC3 లో స్థానికత చాలావరకు మెరుగైంది. వివరాలు <http://wiki.documentfoundation.org/Te>
ధన్యవాదాలు అర్జున
_______________________________________________ Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te Post to : [email protected] Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te More help : https://help.launchpad.net/ListHelp

