అందరికీ నమస్కారం,

వికీమీడియా ఫౌండేషన్ వారి కమ్యూనిటీ రీసోర్సెస్ టీం, లెట్స్ కనెక్ట్ యూజర్
గ్రూప్ కలసి వికీపీడియన్లు ఒకరి నుంచి ఒకరు నేర్చుకునే *"లెట్స్ కనెక్ట్"*
అన్న కార్యక్రమాన్ని
<https://diff.wikimedia.org/2022/03/25/lets-connect-register-now-for-the-peer-learning-program/>
ఎంతో ఉత్సాహంగా ప్రారంభిస్తోంది. మూవ్‌మెంట్ స్ట్రాటజీ ప్రాసెస్‌లో భాగంగా
సేకరించిన ఫీడ్‌బ్యాక్ అనుసరించి ఈ కార్యక్రమం ఏర్పడింది. సముదాయ సభ్యులు తమ
విజ్ఞానాన్ని పంచుకుంటూ ఒకరి నుంచి "తోడ్పాటు"ను పెంపొందిస్తూ కార్యక్రమం
సాగుతుంది.

వికీమీడియా ఉద్యమంలోని పలు అంశాల ఆధారంగా నెలవారీ లెర్నింగ్ క్లినిక్స్,
ఒకరితో ఒకరిని కలపడం అన్న రెండిటి ద్వారా లెట్స్ కనెక్ట్ కార్యక్రమం
ముందుకుసాగుతుంది. వికీమీడియా ఉద్యమంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న సముదాయ
సభ్యులను కలుపుకుంటూ అత్యంత జాగ్రత్తగా రూపొందించబడింది. కార్యక్రమాలు
ప్రాంతాల వారీగా కానీ, వివిధ ప్రాంతాలను కలుపుతూ కానీ జరగవచ్చు.

మీరు ఇందులో చేరాలనుకుంటున్నారా? మీరు ఈ ఫారం
<https://forms.gle/eySNYTsMBqA5V8sM7> ద్వారా "లెట్స్ కనెక్ట్‌"లో భాగం
కావచ్చు. ఈ ఫారంలో మీరు సమర్పించిన సమాచారం ఆధారంగా మిమ్మల్ని ఇతరులతో కలపడం,
లెర్నింగ్ క్లినిక్స్‌కి ఆహ్వానించడం చేస్తాము.

లెట్స్ కనెక్ట్‌కి సంబంధించిన వర్కింగ్ గ్రూప్ సభ్యులతో కానీ, వికీమీడియా
ఫౌండేషన్ సంబంధిత వ్యక్తులను కానీ సంప్రదించాలనుకుంటే దయచేసి మెటా-పేజీ
<https://meta.wikimedia.org/wiki/Grants:Knowledge_Sharing/Connect>ని
సందర్శించడం కానీ, [email protected] కి ఇమెయిల్ చేయడం కానీ
చేయవచ్చు.

అద్భుతమైన మన వికీమీడియా ఉద్యమంతో కలసి పనిచేయడానికి ఉత్సాహంతో ఉన్నాము. మా
వర్కింగ్ గ్రూప్‌ సభ్యులకు, వికీమీడియా ఫౌండేషన్‌కు, ప్రపంచవ్యాప్తంగా
వికీమీడియన్లకు ఈ కార్యక్రమాన్ని వాస్తవరూపం దాల్చేందుకు సహకరించినందుకు
ధన్యవాదాలు.

ధన్యవాదాలతో,
లెట్స్ కనెక్ట్ వర్కింగ్ గ్రూప్

[1] Registration Form <https://forms.gle/eySNYTsMBqA5V8sM7>
[2] Let's Connect Meta Page
<https://meta.wikimedia.org/wiki/Grants:Knowledge_Sharing/Connect>
[3] Let's Connect Diff Posts
<https://diff.wikimedia.org/2022/03/25/lets-connect-register-now-for-the-peer-learning-program/>

-- 
Pavan Santhosh.
_______________________________________________
WikiTe-L mailing list -- [email protected]
To unsubscribe send an email to [email protected]

Reply via email to