మొదట పంపించిన ఇమెయిల్ లో కార్యక్రమము ఫిబ్రవరి 6 అని ఉంది, అది తప్పు. కార్యక్రమము *మర్చి 6 (శనివారం), 6:00 pm నుండి 7:30 pm* వరకు జరుగుతుంది; పాల్గొనడానికి గూగుల్ మీట్ లింకు ఇది https://meet.google.com/oki-espq-kog
On Mon, Mar 1, 2021 at 5:04 PM Krishna Chaitanya Velaga < [email protected]> wrote: > నమస్కారం, > > వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ అఫ్ ట్రస్టీస్ వారు ఫిబ్రవరి 1 నుండి మర్చి 14 > వరకు, కమ్యూనిటీ ద్వారా ఎన్నుకోబడే బోర్డు స్థానాల కోసం సంప్రదింపులు > జరుపుతున్నారు > <https://meta.wikimedia.org/wiki/Wikimedia_Foundation_Board_of_Trustees/Call_for_feedback:_Community_Board_seats>. > దీనికి కారణం; గత పది సంవత్సరాలలో వికీమీడియా ఫౌండేషన్, ప్రాజెక్టులు ఐదు > రెట్లు పెరగగా, బోర్డ్ పనితీరు, ఏర్పాట్లు, ఏమి మారలేదు. ఇప్పుడు ఉన్న విధానాల > ప్రకారం, బోర్డుకు తగినంత సామర్థ్యం, ప్రాతినిధ్యం లేవు. మామూలుగా జరిగే > ఎన్నికలు, బహిర్ముఖులుగా ఉంటూ ఇంగ్లీష్ వికీపీడియా వంటి పెద్ద ప్రాజెక్టులు > లేదా అమెరికా వంటి పాశ్చాత్య దేశాలు నుండి వచ్చేవారికి తోడ్పడుతున్నాయి. > మిగిలిన వారికీ ఎన్ని శక్తిసామర్ధ్యాలు ఉన్నా తగినంత ప్రచారం లేనందు వలన > వారికి ఓటు వేసే వారు తక్కువ మంది. ఉదాహరణకి, వికీమీడియా ఫౌండేషన్ పదిహేను > సంవత్సరాల చరిత్రలో, భారత ఉపఖండం నుండి కేవలం ఒక్కళ్ళు మాత్రమే బోర్డు లో > సేవలు అందించారు. వారు కూడా నిర్దిష్ట నైపుణ్యం కోసం నేరుగా నియమించబడ్డవారే > గాని, ఎన్నుకోబడలేదు. > > రానున్న నెలలో, మొత్తం ఆరు కమ్యూనిటీ బోర్డు స్థానాల కోసం ఎన్నికలు జరగాల్సి > ఉంది. ఇప్పుడు జరుగుతున్న సంప్రదింపుల ద్వారా బోర్డు వారు కమ్యూనిటీల నుండి > వారి పద్ధతుల మీద అభిప్రాయం సేకరిస్తున్నారు. ఈ నిమిత్తం తెలుగు కమ్యూనిటీలో > తో మాట్లాడేందుకు ఒక ఆన్లైన్ సమావేశం ఏర్పాటు చేయబడింది. ఇది *ఫిబ్రవరి 6 > (శనివారం), 6:00 pm నుండి 7:30 pm వరకు* జరుగుతుంది; పాల్గొనడానికి *గూగుల్ > మీట్ లింకు* ఇది https://meet.google.com/oki-espq-kog. దయచేసి సభ్యులందరు > రావాల్సినదిగా కోరుతున్నాను. > > - కృష్ణ చైతన్య > _______________________________________________ WikiTe-L mailing list [email protected] https://lists.wikimedia.org/mailman/listinfo/wikite-l
