అందరికీ నమస్కారం,

2018 అక్టోబరు 20-21 తేదీల్లో బెంగళూరు లేక నగరానికి సమీపంలో వికీమీడియా
కాపీహక్కుల సంబంధిత అంశాలపై కార్యశాల జరగనుంది. అక్టోబరు 19 తేదీ సాయంత్రం
నుంచి ప్రీ-ఈవెంట్ జరుగుతుంది.

దక్షిణ భారతదేశ రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ
రాష్ట్రాల నుంచి యాక్టివ్‌గా కృషిచేస్తున్న ఏ వికీమీడియన్ అయినా కార్యశాలలో
పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

User:Yann (యాన్) కార్యశాల ప్రధాన శిక్షకునిగా వ్యవహరిస్తారు.

కార్యశాలలో చర్చించే కొన్ని అంశాలు ఇవి (మరిన్ని అంశాలు చేరవచ్చు)

   - వివిధ క్రియేటివ్ కామన్స్ లైసెన్సులు (సీసీ లైసెన్సులు), సీసీ, ఎస్‌ఎ,
   బై, ఎన్‌డి, ఎన్‌సి, 2.0, 3.0, 4.0 వగైరా పరిభాష గురించి
   - సాధారణంగానూ, భారతదేశంలో ప్రత్యేకించీ సార్వజనీనం
   - పెయింటింగ్, శిల్పాలు, పురావస్తువులు, స్మారక కట్టడాలు, నాణేలు, బ్యాంకు
   నోట్లు, పుస్తకాల ముఖపత్రాలు వంటివాటి కాపీహక్కులు
   - ఫ్రీడమ్ ఆఫ్‌ పనోరమా
   - వ్యక్తి హక్కులు (పర్సనాలిటీ రైట్స్)
   - ఉరుగ్వే రౌండ్ అగ్రిమెంట్స్ యాక్ట్ (యుఆర్ఎఎ, ప్రత్యేకించి భారతీయ
   కృతులపై ప్రభావం)
   - గవర్నమెంట్ ఓపెన్ డేటా లైసెన్స్ ఇండియా (జీవోడీఎల్)
   - *పాల్గొనే సభ్యుల అవసరాల మదింపు ఆధారంగా అంశాలు పెరగవచ్చు*

కార్యక్రమ పేజీని ఇక్కడ చూడండి, మీ ఆసక్తి మేరకు పాల్గొనడాన్ని పరిగణించగలరు:
https://meta.wikimedia.org/wiki/CIS-A2K/Events/Copyright_workshop:_South_India

పాక్షికంగా పాల్గొనే వీలు లేదు. జెండర్ గ్యాప్ తగ్గించే క్రమంలో మహిళా
వికీపీడియన్లు దరఖాస్తు చేసుకునేందుకు ప్రోత్సహిస్తున్నాం.

ధన్యవాదాలతో,
పవన్ సంతోష్‌
_______________________________________________
WikiTe-L mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikite-l

Reply via email to