అందరికీ నమస్కారం, డిసెంబరు రెండవ ఆదివారం నాడు తెలుగు వికీపీడియా దినోత్సవంగా గత సంవత్సరం నుంచి నిర్మాణాత్మకమైన చక్కని కార్యక్రమాలతో నిర్వహించుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో నిర్వహించ తలపెట్టి వివిధ కారణాలుగా వాయిదా వేసుకున్న మిని మీడియా వికీ ట్రైనర్, మిని ట్రైన్-ద-ట్రైనర్ కార్యక్రమాలు డిసెంబరు 2016 రెండవ శనివారం, ఆదివారం (డిసెంబర్ 10, 11) నాడు నిర్వహించుకుందాం. అవి కాక రెండవ రోజు సాయంత్రం పత్రికల ప్రతినిధులను ఆహ్వానించి తెలుగు వికీపీడియా, వికీమీడియా విజయాలు, సాధించాల్సినవి ఒక ఉద్యమంగా దీని విశిష్టత వంటివి వివరించే కార్యక్రమమూ నిర్వహిద్దాం. మినీ మీడియా వికీ ట్రైనర్ కార్యక్రమం ద్వారా తెలుగు వికీపీడియాన్లకు అవసరమైన సాంకేతిక అంశాలు నేర్పించవచ్చు, అలానే మిని టిటిటి ద్వారా పలు శిక్షకులకు అవసరమైన నాయకత్వ లక్షణాలు వంటివి నేర్పించేందుకు ఉపకరిస్తుంది. ఈ కార్యక్రమాలు తెలుగు వికీపీడియా సముదాయాన్ని బలపరిచి, తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల అభివృద్ధికి నిర్మాణాత్మకంగా ఉపకరిస్తుందని భావిస్తున్నాం. దీనిపై సముదాయ సభ్యులు తమ అభిప్రాయాలు తెలియజేయగలరు. ధన్యవాదాలతో, పవన్ సంతోష్. _______________________________________________ WikiTe-L mailing list [email protected] https://lists.wikimedia.org/mailman/listinfo/wikite-l
